
రామ్ పోతినేని హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ పి.మహేష్ బాబు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్ కెరీర్‌లో ఇది 22వ సినిమా. ‘ర్యాపో 22’ వర్కింగ్ టైటిల్‌తో దీన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తవగా, ఈ మూవీ టైటిల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రామ్ అభిమానులు. తాజాగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. మే 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నట్టు గురువారం ప్రకటించారు.
‘విజిల్స్ రెడీ, కటౌట్స్ పెయింటెడ్, మిల్క్ బకెట్స్ లోడెడ్, వన్ మ్యాన్ వన్ షో.. ఏ మిలియన్ ఎమోషన్స్..’ అంటూ ఈ సందర్భంగా పోస్ట్ చేసిన టీమ్ టైటిల్‌పై క్యూరియాసిటీని పెంచింది. ఇందులో సాగర్ పాత్రలో రామ్ పోతినేని, మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్, మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.