GHMC : మైత్రీవనం నాలా పునర్నిర్మాణానికి ప్లాన్ ... జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్

GHMC : మైత్రీవనం నాలా పునర్నిర్మాణానికి ప్లాన్  ... జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: మైత్రీవనంలో నాలా పునర్నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మైత్రీవనం వద్ద ఉన్న నాలాను ఖైరతాబాద్  జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్, కన్సల్టెంట్లతో కలిసి పరిశీలించారు. ఇక్కడ వరద సమస్యను  పరిష్కిరించే  మార్గాలపై వారితో చర్చించారు. ప్రజల భద్రత, ఆస్తుల పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని వరద నిర్వహణకు వీలుగా నాలాను పునర్నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.