సస్పెన్స్‌కు తెర.. మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్ ఏకగ్రీవం

సస్పెన్స్‌కు తెర.. మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్ ఏకగ్రీవం

మణిపూర్ ముఖ్యమంత్రిగా మళ్లీ బీరేన్ సింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఇంఫాల్ లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బీరేన్ సింగ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులు నిర్మలాసీతారామన్, కిరణ్ రిజుజు హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గానూ.. బీజేపీ 32 స్థానాల్లో గెలిచింది. 

మోడీ నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయన్నారు నిర్మలా సీతారామన్.. బీరేన్ సింగ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మణిపూర్ లో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పడిందనడానికి ఇదే నిదర్శనమన్నారు నిర్మలా సీతారామన్.