నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు ఎట్టకేలకు కనిపించారు. కరోనా ప్యాండమిక్ తర్వాత ఐదు నెలల్లో మొదటిసారి ఆమె మీడియాలో దర్శనమిచ్చారు. లునార్ న్యూ ఇయర్ హాలిడే సందర్భంగా ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ లోని మన్సుడే ఆర్ట్ థియేటర్ లో జరిగిన ఆర్ట్ ప్రదర్శనకు కిమ్ దంపతులు హాజరయ్యారు. వీరిద్దరూ ఆడిటోరియంకి ఎంట్రీ ఇచ్చే క్రమంలో స్వాగత సంగీతం వినిపించినప్పుడు ప్రేక్షకులు హుర్రే..హర్రే..అంటూ హోరెత్తించారు. దంపతులు వేదిక మీదకు నడుచుకుంటూ వస్తుండగా అక్కడున్న వారంతా కేరింతలు కొట్టారు. అంతేకాదు కళాకారులతో కరచాలనం చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. దేశంలో కరోనా పీక్ స్టేజీకి చేరుకున్న సమయంలో కిమ్ భార్య రిసోల్ గత ఏడాది సెప్టెంబర్ 9న కనిపించారు.
మరిన్ని వార్తల కోసం
