ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలో భారీ భూకంపం

జకార్తా : ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. కెపులవన్ బరత్ దయాలో తెల్లవారు జామున భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది.  భూ అంతర్భాగంలో 127 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూరోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకటించింది. భూ ప్రకంపనల ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు ప్రకటించారు. గత నెల 19వ తేదీన కూడా ఇండోనేషియాలో 5.5 తీవ్రతతో భూమి కంపించింది. 

For more news..

సైకిల్‌పై పార్లమెంట్‌కు కేంద్ర మంత్రి

2020లో కొవిడ్ కేసుల కంటే ఈ 10 వారాల్లో వచ్చినవే ఎక్కువ