
ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీని న్యాక్ బృందం పరిశీలించింది. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కాకా విద్యాసంస్థల్లోని లా కాలేజీని ఇటీవల న్యాక్ దృష్టికి యాజమాన్యం తీసుకెళ్లింది. ఇందులో భాగంగా న్యాక్ టీం చైర్మన్‌తో పాటు ముగ్గురు మెంబర్లు, కోఆర్డినేటర్లు సోమ, మంగళవారం లా కాలేజీని ఆన్‌లైన్‌లో పరిశీలించారు. రెండ్రోజుల పాటు వెరిఫికేషన్ కొనసాగగా, ఇన్‌స్టిట్యూట్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం, వసతులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో కాలేజీ మేనేజ్‌మెంట్, లెక్చరర్లు, విద్యార్థులు న్యాక్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.
వారం రోజుల్లో రిజల్ట్స్ రానున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా మేనేజ్‌మెంట్ చైర్మన్ గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరై ఇన్‌స్టిట్యూట్ అధ్యాపకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జి.వినోద్, కరస్పాండెంట్ సరోజా వివేక్, జాయింట్ సెక్రటరీ రమణ, కౌన్సిల్ మెంబర్ ప్రియా అంగర్, డైరెక్టర్ విష్ణు ప్రియ, ప్రిన్సిపల్ సృజన పాల్గొని న్యాక్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.