చదువులో వెనకబడిన విద్యార్థుల వివరాలివ్వండి : కలెక్టర్ జితేశ్వి.పాటిల్

చదువులో వెనకబడిన విద్యార్థుల వివరాలివ్వండి : కలెక్టర్ జితేశ్వి.పాటిల్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ప్రీ ఫైనల్​ఎగ్జామ్స్ ఫలితాల ఆధారంగా చదువులో వెనకబడిన పదోతరగతి విద్యార్థుల వివరాలను రెండు రోజుల్లోగా ఇవ్వాలని కలెక్టర్ జితేశ్​వి.పాటిల్ ఆదేశించారు. బుధవారం విద్యాశాఖ అధికారులు, హెచ్ఎంలతో జూమ్​ మీటింగ్ నిర్వహించారు.  చదువులో వెనకబడిన విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్​ ఇవ్వాలని చెప్పారు. బాలికలతో పోలిస్తే బాలుర ఉత్తీర్ణతా శాతం తక్కువగా ఉంటోందని, ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఎగ్జామ్స్​కు ముందే అన్ని పాఠశాలల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలికలకు టాయ్​లెట్స్​లేని స్కూల్స్​ఉండొద్దన్నారు. జిల్లాలో 30 ఏండ్లలోపు నిరుద్యోగ యువతను గుర్తించి నైపుణ్య శిక్షణనిచ్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.