తెలంగాణను ఒక్క కుటుంబం కోసం ఇవ్వలేదు: రాహుల్ గాంధీ

తెలంగాణను ఒక్క కుటుంబం కోసం ఇవ్వలేదు: రాహుల్ గాంధీ

నర్సంపేటలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.  ఒక్క కుటుంబం కుటుంబం కోసం తెలంగాణను ఇవ్వలేదన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 4 వేలు పెన్షన్ ఇస్తామన్నారు.  కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారని  రాహుల్ అన్నారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును ప్రజల ఖాతాల్లో జమ చేస్తామన్నారు.  

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 500 లకే గ్యాస్ సిలెండర్ ఇస్తామన్నారు.  పార్లమెంట్ లో బీజేపీకి అనుకూలంగా బీఆర్ఎస్  నిర్ణయాలు తీసుకుంటుదన్నారు.  దళిత బంధు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు  ఒక్కొక్కరు రూ.2 లక్షలు తీసుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు  24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని రాహుల్ గాంధీ  నర్సంపేట సభలో  తెలిపారు.   డ్వాక్రా గ్రూపులకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు.  గృహ జ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు.