V6 News

28 ఏళ్ల తర్వాత నాగ్‌‌‌‌కు జోడీగా టబు

28 ఏళ్ల తర్వాత నాగ్‌‌‌‌కు జోడీగా టబు

టాలీవుడ్‌‌‌‌లో కొన్ని కాంబినేషన్స్‌‌‌‌కు ఎన లేని క్రేజ్ ఉంటుంది. వారిలో నాగార్జున, టబు హిట్‌‌‌‌ పెయిర్‌‌‌‌‌‌‌‌గా పేరు పొందారు. వీరి కాంబోలో నిన్నేపెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే, సిసింద్రీ చిత్రాలు అప్పట్లో సూపర్‌‌‌‌‌‌‌‌ హిట్‌‌‌‌గా నిలిచాయి. మళ్లీ 28 ఏళ్ల తర్వాత ఈ  క్రేజీ జోడీ కలిసి స్ర్కీన్‌‌‌‌ షేర్ చేసుకోబోతున్నారు. నాగార్జున నటిస్తున్న 100వ చిత్రంలో టబు ఆన్ బోర్డ్ అయినట్టు టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే శరవేగంగా జరుగుతోన్న ఈ మూవీ షూటింగ్‌‌‌‌లో టబు జాయిన్ అయ్యినట్టు తెలియజేశారు.

వీరిద్దరి సూపర్ హిట్ కాంబినేషన్ మరోసారి తెరపై కనిపించనుండటంతో  సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున స్టైలిష్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో ఇంప్రెస్ చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌‌‌‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి  కింగ్ 100, లాటరీ కింగ్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.  ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.