కస్టడీ పరిస్థితి ఏంటి? బాక్సాఫీస్ కష్టాలు తప్పేనా

కస్టడీ పరిస్థితి ఏంటి? బాక్సాఫీస్ కష్టాలు తప్పేనా

అక్కినేని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘కస్టడీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవాన్ని చవి చూసింది. నాగ చైతన్య హీరోగా వచ్చిన ఈ మూవీ.. మే 12న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి మొదటి షో నుండే నెగిటీవ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాకి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. తొలి వీకెండ్ లో ఈ మూవీ కేవలం రూ. 6.6 కోట్లు మాత్రమే వసూళు చేసింది.

ఇక రిలీజ్ రోజు రెండు భాషల్లో కలిపి రూ. 3.2 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నాగ చైతన్య లాంటి హీరోకి ఇది చాలా తక్కువ. సాధారణంగా ఏ సినిమా అయినా తొలి వీకెండ్ లో మంచి కలెక్షన్లను రాబడతాయి. కానీ ఈ సినిమాకి మాత్రం కనీస వసూళ్లు కూడా రావడంలేదు. ఫ్లాప్ టాక్ రావడంతో ప్రేక్షకులు కూడా థియేటర్స్ కు వెళ్లే సాహసం చేయడంలేదు. ఎలాగూ ఓటీటీలో వచ్చేస్తుంది కదా అప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారు. దీంతో ‘కస్టడీ’ మూవీ భారీ నష్టాన్ని చవిచూసింది.

రీసెంట్ గా అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ మూవీకి కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా కూడా కనీస వసూళ్ళని రాబట్టలేకపోయింది. దీంతో భారీ నష్టాలని చవిచూసింది. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు అర్జెంట్ గా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. అక్కినేని అభిమానులు కూడా తమ ఫెవరెట్ హీరోలు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.