హిట్ కాంబో రిపీట్.. ఆసక్తిగా NC23 పోస్టర్

హిట్ కాంబో రిపీట్.. ఆసక్తిగా NC23 పోస్టర్

నాగ చైతన్య (Naga Chaitanya)..చందూ మొండేటి (Chandoo Mondeti), క్రేజీ కాంబోలో మరో మూవీ (NC23) రాబోతుంది. ప్రేమమ్ మూవీతో మంచి హిట్ అందుకున్న వీరు..త్వరలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లేటెస్ట్గా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ..త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతున్నట్లు మేకర్స్ తెలిపారు.  NC23 వర్కింగ్ టైటిల్తో వస్తోన్న ఈ మూవీకి తండేల్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 

ఈ మూవీ..శ్రీకాకుళం నుండి గుజరాత్కు వలస వెళ్లే మత్స్యకారుల కుటుంబాల నేపథ్యంలో కథను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కొంత మంది మత్స్యకారులు పాకిస్థాన్ బార్డర్కు తప్పి పోవడంతో..వారు తిరిగి ఇండియా రావడానికి ఎదుర్కొన్న పరిస్థుతుల ఇతివృత్తంతో స్టోరీ సాగునుందని సమాచారం. ఇందులో  బోటు డ్రైవర్ పాత్రలో చైతూ.. పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి కనిపిస్తుండగా..వీరి మధ్య ఒక అందమైన ప్రేమకథను డైరెక్టర్ చూపించబోతున్నాడు. 

NC 23 మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ స్వరాలూ అందిస్తున్నట్లు సమాచారం. అదే నిజమైతే..మంచి ఫామ్ లో ఉన్న అనిరుధ్..ఈ సినిమాకి ఎటువంటి స్వరాలూ అందిస్తాడో చూడాలి. ఈ మూవీని గీతా ఆర్ట్స్(Geeta Arts) బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాసు పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నారు.