థాంక్యూ అంటున్న నాగ చైతన్య

V6 Velugu Posted on Nov 24, 2021

వరుస సినిమాలతో మంచి హుషారు మీదున్నాడు నాగచైతన్య. ఈ మధ్యనే ‘లవ్‌‌స్టోరీ’తో వచ్చి కాంప్లిమెంట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం బంగార్రాజు, థాంక్యూ చిత్రాల్లో నటిస్తున్నాడు. నిన్న  చైతూ పుట్టినరోజు కావడంతో ఈ రెండు సినిమాలకి సంబంధించిన అప్‌‌డేట్స్ వచ్చాయి. ‘బంగార్రాజు’ టీమ్‌‌ చైతు ఫస్ట్ లుక్‌‌తో పాటు  టీజర్​ని కూడా వదిలింది. ‘థాంక్యూ’ మేకర్స్‌‌ ఫస్ట్‌‌ లుక్‌‌ పోస్టర్‌‌‌‌తో విషెస్ చెప్పారు. ఈ పోస్టర్‌‌‌‌లో కూల్‌‌ గయ్‌‌లా కనిపిస్తున్నాడు చైతు. నీట్‌‌గా టక్ చేసుకుని, కళ్లజోడు పెట్టుకుని.. అటు స్టైలిష్‌‌గాను, ఇటు డీసెంట్‌‌గాను కూడా ఉన్నాడు. రంగులరాట్నం ఎక్కి చిన్నపిల్లాడిలా సంబర పడు తున్నాడు. బ్యాగ్రౌండ్‌‌ని బట్టి ఇది ఫారిన్‌‌ లొకేషన్‌‌లో తీసిన స్టిల్‌‌ అని అర్థమవుతోంది. బీవీఎస్ రవి కథ, మాటలు రాసిన ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకుడు. రాశీఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ హీరోయిన్స్‌‌గా నటిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది యాక్టర్‌‌‌‌గా చైతూలోని మరో కొత్త కోణాన్ని వెలికితీసే చిత్రమన్నారు నిర్మాతలు. ఆ టైటిల్‌‌ ఎందుకు పెట్టారు, ఎవరు ఎవరికి థాంక్యూ చెప్తారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ‌

Tagged Naga Chaitanya, samantha, thank you movie, tollywood news

Latest Videos

Subscribe Now

More News