
నాగశౌర్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంతో పవన్ బాసింశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఉగాది సందర్భంగా టైటిల్‌ను అనౌన్స్ చేసిన టీమ్, తాజాగా మూవీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చింది. జులై 7న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో శౌర్య ట్రెండీగా కనిపిస్తున్నాడు. ఇందులో ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో నటిస్తున్న శౌర్య.. ఇందుకోసం మేకోవర్ అయ్యాడు. షూటింగ్ చివరి దశలో ఉంది. ‘లవ్ స్టోరీ’ ఫేమ్ సి.హెచ్.పవన్ సంగీతం అందిస్తుండగా, దివాకర్ మణి డీవోపీగా వర్క్ చేస్తున్నారు. హీరోయిన్‌తో పాటు ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు.