Rangabali Review: రంగబలి రిజల్ట్ ఏంటి? నాగశౌర్యకు హిట్‌ పడిందా?

Rangabali Review: రంగబలి రిజల్ట్ ఏంటి? నాగశౌర్యకు హిట్‌ పడిందా?

"రంగబలి(Rangabali)".. టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య(Naga Shourya) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ. కొత్త దర్శకుడు పవన్ బసంశెట్టి(Pawan basamsetty) తెరకెక్కించిన ఈ సినిమాను చెరుకూరి సుధాకర్(Cherukuri sudhakar) నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ, లవ్ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా.. జులై 7 శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న నాగ శౌర్యకు ఈ సినిమా హిట్ అందించిందా? లేదా? అనేది ఈ రివ్యూలో చూద్దాం. 

కథ: శౌర్య (నాగ‌శౌర్య‌)కు తన సొంతూరు రాజ‌వ‌రం అంటే చాలా ఇష్టం. ఎం చేసైనా ఊరిలోనే కింగులా బ‌త‌కాలని, ప‌ది మంది చూపు త‌న‌పైనే ఉండాల‌ని అనుకుంటాడు. శౌర్య తండ్రి విశ్వం (గోప‌రాజు ర‌మ‌ణ‌ Goparaju ramana)కు ఊళ్లో ఒక మెడిక‌ల్ షాపు నడుపుతూ గౌరవంగా జీవిస్తూ ఉంటాడు. కానీ శౌర్య మాత్రం ఊళ్లో అందరితో గొడ‌వ‌లు పడుతూ ఏ భాద్యత లేకుండా బ‌తికేస్తుంటాడు. అందుకే శౌర్యను దారిలో పెట్టాల‌ని బ‌ల‌వంతంగా వైజాగ్ పంపిస్తాడు తండ్రి విశ్వం. అక్కడ స‌హ‌జ (యుక్తి త‌రేజ‌Yukthi thareja)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు శౌర్య. మరి వైజాగ్ వెళ్ళాక శౌర్య మారాడా? హీరోయిన్ తండ్రకి రంగబలి సెంటర్ కి ఉన్న కనెక్షన్ ఏంటి? చివరకి హీరోయిన్ సహజని శౌర్య పెళ్లి చేసుకున్నాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ టోన్ లోనే సాగుతుంది. హీరో ఇంట్రో, ఫాథర్ తో ఫన్నీ సీన్స్, సాంగ్స్, లవ్ సీన్స్ బలే ఎంటెర్టైనింగ్ గా ఉంటాయి. మధ్యలో స‌త్య కామెడీ కూడా బాగానే వ‌ర్క‌వుట్ అయ్యింది. నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా స‌త్య కామెడీనే ప్ర‌ధానంగా సాగుతుంది. హీరోయిన్ తో  లవ్ ట్రాక్ లో కూడా స‌త్య క్యారక్టర్ వినోదాన్ని పంచుతుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ లోల్ వచ్చే ట్విస్ట్‌ అదిరిపోతుంది. అక్కడినుండి అసలు కథ మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ స‌ర‌దాగా సాగిన క‌థ‌.. సెకండ్ హాఫ్ సీరియ‌స్ టోన్ లోకి మారిపోతుంది. రంగ‌బ‌లి సెంట‌ర్ పేరు మార్చ‌డం కోసం శౌర్య చేసే ప్ర‌య‌త్నాలు, ఆ క్ర‌మంలో ఊరి ఎమ్మెల్యేకు శౌర్య‌కు మ‌ధ్య వచ్చే సీన్స్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయి. ఈ క్రమంలో వచ్చే రంగబలి ఫ్లాష్ బ్యాక్ సీన్స్, దానికి శౌర్య కి ఉన్న లింక్ ఆడియన్స్ ను మెప్పిస్తాయి.

నటీనటులు: శౌర్య పాత్రలో నాగ‌శౌర్య‌ పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యాడు. తన అచ్చొచ్చిన సరదా కుర్రాడి పాత్రను మరి సారి నెక్స్ట్ లెవల్లో చేశారు నాగ శౌర్య. కామెడీ, యాక్ష‌న్, సెంటిమెంట్ ఇలా అన్ని విభాగాల్లో ఎన‌ర్జీటిక్ గా క‌నిపించాడు.ఇక స‌హ‌జ పాత్ర‌లో యుక్తి బానే చేసింది. గ్లామ‌ర్ కూడా బాగానే ఒలికించింది. ఇక అగాధం పాత్ర‌లో స‌త్య న‌ట‌న ప్రేక్షకులను క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే సత్య లేకపోతే సినిమా పరిస్థితిని ఊహించుకోవడం కష్టమే. ఇక గోప‌రాజు ర‌మ‌ణ‌, ముర‌ళీ శ‌ర్మ, శుభ‌లేఖ సుధాక‌ర్ త‌దితరుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఆకట్టుకున్నారు.

నిజానికి క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల్లో కామెడీని యాడ్ చేయడం అనేది చాలా కష్టం. ప‌వ‌న్ ఆ పని చ‌క్క‌గా చేసి చూపాడు. మధ్యలో కాస్త అంటూ ఇటూ అయినా.. మళ్ళీ క్లిమక్స్ కు వచ్చేసరికి ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దుకోలేక‌పోయాడు. ఇక ప‌వ‌న్ సిహెచ్ సంగీతం ఆకట్టుకుంటుంది. కెమెరా వర్క్, నిర్మాణ విలువ‌లు కూడా ఆకట్టుకుంటాయి.

మొత్తంగా చెప్పాలంటే "రంగబలి".. ఈ కామెడీ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఆకట్టుకుంటుంది.