- నాగర్‌కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలో ఈనెల 20 నుంచి 26 వరకు నిర్వహించనున్న సంక్షేమ వారోత్సవాలను జిల్లా యంత్రాంగం సమన్వయంతో సక్సెస్ చేయాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ వారోత్సవాల నిర్వహణపై ముందస్తుగా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు మార్గనిర్దేశం చేసేలా నిపుణులతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వసతి గృహాల్లో తాగునీరు, విద్యుత్, సీసీ కెమెరాలు, పెయింటింగ్, మరుగుదొడ్ల రిపేర్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

