
కింగ్ నాగార్జున(Nagarjuna) తమిళ హీరో ధనుష్(Danush) తో సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. తమిళ స్టార్ ధనుష్ హీరోగా.. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా వస్తన్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై ఆసియన్ సునీల్ ఈ సినిమాని నిర్మిస్తున్న ఈ సినిమా ఈ మధ్యే కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.
A POWERHOUSE addition to the POWERFUL PROJECT ?
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) August 29, 2023
Wishing KING @iamnagarjuna Garu a very Happy Birthday ❤️
Delighted and honoured to have you on board ❤️?@dhanushkraja @iamRashmika @sekharkammula @AsianSuniel @puskurrammohan @SVCLLP @amigoscreation @UrsVamsiShekar pic.twitter.com/uiUEf5tgkU
అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా ఓ కీ రోల్ లో కనిపించనున్నారట. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాణ సంస్థ. ఆగస్టు 29 నాగార్జున పుట్టినరోజు సంధర్బంగా ఈ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ అప్డేట్ లో.. శేఖర్ కమ్ముల, ధనుష్ సినిమాలో ఒక పవర్ హౌస్ లాంటి గెస్ట్ రోల్ కావలి అనుకున్నాం. దానికి కింగ్ నాగార్జున కంటే పర్ఫెక్ట్ ఇంకెవరు ఉంటారు. ఆయనని తెరపై కొత్తగా చూపించడానికి ఎదురుచూస్తున్నాం కానీ.. ఈ సారి మేము చూపించే షో మాములుగా ఉండదు అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ధనుష్ 51వ సినిమాగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది.