Manmadudu Re-release: ఆడవాళ్లంటే పడని ఆ మన్మధుడు మళ్ళీ వస్తున్నాడు

Manmadudu Re-release: ఆడవాళ్లంటే పడని ఆ మన్మధుడు మళ్ళీ వస్తున్నాడు

అక్కినేని నాగార్జున(Akkineni nagarjuna) కెరీర్ లో ది బెస్ట్ మూవీస్ లిస్టులో తప్పకుండ ఉండే మూవీ మన్మథుడు(Manmadhudu). కె. విజయ్ భాస్కర్(K Vijaya bhaskar) దర్శకత్వంలో 2002లో వచ్చిన ఈ సినిమాను బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా నాగార్జునకు జోడీగా సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన కథ, మాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అయితే తాజా సమాచారం మేరకు.. మన్మధుడు సినిమాను రీరిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఆగస్టు 29 అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈ సినిమా రీరిలీజ్ కానుంది. ఇందులో భాగంగానే 4k ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

నిజానికి మన్మధుడు సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. సినిమాలో సీన్స్, సాంగ్స్, త్రివిక్రమ్ సంభాషణలు.. ఇలా ప్రతీ ఒక్కటి ప్రేక్షకులను కట్టి పిడిస్తాయి. ఇక దేవి మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో.. బీజీఎం కూడా అంతే సోల్ఫుల్ గా ఉంటుంది. అందుకే ఆ కాలంలో ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ అయినా వాళ్ళు థియేటర్స్ లో చూసేందుకు వీలుగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు.