నా సామి రంగా.. నాగ్ దూకుడు మాములుగా లేదుగా

నా సామి రంగా.. నాగ్ దూకుడు మాములుగా లేదుగా

టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) కెరీర్ లో 99వ సినిమాగా రానున్న నా సామి రంగా మూవీ జెడ్ స్పీడ్తో దూసుకెళ్తోంది. ఆగస్టు 29 నాగార్జున పుట్టినరోజు సందర్బంగా షూటింగ్ స్టార్ట్ చేసిన మేకర్స్..ఎలాగైన సంక్రాంతి బరిలో నిలవడానికి అహర్నిశలు వర్క్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమా షూట్ ప్రస్తుతం మైసూర్ లో జరుగుతోంది. సంక్రాంతి అంటే నాగ్ మూవీ ఉండాల్సిందే..ఆడియన్స్ కోరిక మేరకు మేకర్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారేమో! అసలు సినిమా ఎంత ఫాస్ట్ గా పూర్తవుతోందీ అంటే..వచ్చే నెల డిసెంబర్ 5 వరకు నాలుగు పాటలు మినహా మిగిలిన సినిమా అంతా కంప్లీట్ కాబోతున్నట్లు యూనిట్ సభ్యుల నుంచి లాక్. ప్రస్తుతం ఒక సాంగ్ షూట్ జరుగుతోండగా..డిసెంబర్ ఫస్ట్వీక్ లో ఫైట్ సీన్ చిత్రీకరణ వుంటుందని తెలుస్తోంది. 

ప్రముఖ నృత్య దర్శకుడు విజయ్ బిన్నీ(Vijay binny) తెరకెక్కిస్తున్న ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ మూవీకి ఆస్కార్ విన్నర్స్ అయిన..హిట్ మ్యూజికల్ పెయిర్ కీరవాణి-చంద్రబోస్ వీరిద్దరూ కలిసి పాటల సందడి షూరూ చేశారు. వీరి నుంచి అదిరిపోయే రీతిలో ఓ అయిదు పాటలు రాబోతున్నాయి. ఈ పాటలు నా సామి రంగా లో ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం. పవన్‌ కుమార్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్‌ బెజవాడ కథ అందిస్తున్నాడు. 

రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లింప్స్లో నాగార్జున లుంగీ కట్టుకొని, బీడీ కాలుస్తూ మాస్ అవతారంలో కనిపించారు. గ్లింప్స్ చివర్లో నాగ్ చెప్పిన..ఈ పండక్కి నా సామిరంగ అనే డైలాగ్ ఆడియన్స్ ను ఎగ్జైట్ చేసినట్లే..సినిమా షూటింగ్ కూడా ఎగ్జైట్ చేస్తోంది.