పిల్లల వ్యాక్సిన్లపై అమెరికా సంచలన నిర్ణయం.. ఆస్పత్రుల పాలు చేయడానికే అంటూ డాక్టర్ల ఆందోళన

పిల్లల వ్యాక్సిన్లపై అమెరికా సంచలన నిర్ణయం.. ఆస్పత్రుల పాలు చేయడానికే అంటూ డాక్టర్ల ఆందోళన

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. కొన్ని నిర్ణయాలపై ఇప్పటికే సొంత పార్టీ నేతలు, ప్రభుత్వ వర్గాలు వ్యతిరేకించడం చూస్తూనే ఉన్నాం. లేటెస్టుగా పిల్లలకు వ్యాధులను అరికట్టేందుకు రెకమెండ్ చేసే చాలా వ్యాక్సిన్లను ప్రభుత్వం తగ్గించడం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పిల్లల్లో వచ్చే 11 వ్యాధులను నయం చేసేందుకు ఇచ్చే వ్యాక్సిన్ ల రెకమెండేషన్స్ ను తగ్గించింది ప్రభుత్వం. అంటే చాలా వ్యాక్సిన్లను రెకమెండ్ చేయకుండా.. తక్కువ వ్యాక్సిన్లనే వాడుకలో ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు ప్రతి చిన్నారికి రెకమెండ్ చేసిన వ్యాక్సిన్స్.. ఇప్పుడు ప్రిస్క్రైబ్ చేయకూడదనే నిర్ణయం ఇప్పుడు విమర్ఖల పాలవుతోంది. ఈ నిర్ణయాన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లోని హెల్త్ సెక్రెటరీ రాబర్ట్ ఎఫ్.కెనడీ జూనియర్ సమర్థించగా.. ఇది చాలా కన్ఫ్యూజన్ లో పడేయటమే కాకుండా.. పిల్లలను అనారోగ్యాల బారిన పడేస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

ఫ్లూ జ్వరం, రొటవైరస్, హెపటైటిస్ట్ బి, ఆర్ఎస్‌వీ మొదలైన కొన్ని వ్యాక్సిలను రెకమెండ్ చేయకుండా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మందులు ఇప్పటికీ అందుబాటులో ఉంటున్నాయి. కావాల్సిన వాళ్లు ఇప్పటికీ కొనవచ్చు. కానీ ప్రస్తుత నిర్ణయం ప్రకారం.. స్టాండర్డ్ షెడ్యూల్ రెకమెండేషన్స్ లో ఉండదని తెలుస్తోంది. 

తట్టు, కోరింత దగ్గు, పోలియో, ధనుర్వాతం, చికెన్ పాక్స్, HPV మొదలైన వ్యాక్సిన్లను రెకమెండ్ చేయకుండా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఆదేశాల ప్రకారం.. చాలా మంది చిన్నారులకు ఒకే HPV డోస్  సజ్జెస్ట్ చేయాలని చెబుతోంది ప్రభుత్వం. గతంలో వయసును బట్టి రెండు లేదా మూడు రెకమెండ్ చేసేవారు.

ఎందుకు ప్రభుత్వ కఠిన నిర్ణయం:

పిల్లల డోసేజ్ విషయంలో మిగతా దేశాల కంటే అమెరికా ఎక్కువ మెడిసిన్  రెకమెండ్ చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. చాలా దేశాలు తక్కువ వ్యాక్సిన్స్ నే రెకమెండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇతర దేశాలతో పోల్చితే అమెరికాలో వ్యాక్సిన్ ఉపయోగం ఎక్కువగా ఉందని తెలిపారు. లిస్టును కుదించడం వలన ప్రజలకు మందులపైన విశ్వాసం ఉంటుందని  చెబుతున్నారు.

డాక్టర్లు ఎందుకు ఆందోళన చెందుతున్నారు..?

ప్రభుత్వ నిర్ణయాన్ని మెడికల్ ఎక్స్ పర్ట్స్ తప్పుబడుతున్నారు. ఎలాంటి పబ్లిక్ చర్చ, సమీక్ష లేకుండా  ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడమేంటని మండిపడుతోంది అమెరికన్ అకాడెమీ ఆఫ్ పిడియాట్రిక్స్. పిల్లల జీవితాలను రిస్కులో పెట్టి పబ్లిక్ హెల్త్ విషయంలో ఇతర దేశాలను కాపీ చేసి పేస్ట్ చేయలేమని డా.సీన్ ఓలెరీ పేర్కొన్నాడు. 

అయితే పేరెంట్స్ కుఈ మెడిసిన్ పైన ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఈ మార్పులతో లో వ్యాక్సినేషన్ రేట్స్ తగ్గే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.