మారుతి, ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన సినిమా ’ది రాజా సాబ్‘. ఈ సినిమా టికెట్ రేట్ల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. రాజాసాబ్ ప్రీమియర్ షో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి వెయ్యి రూపాయలకు అమ్ముకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 9న విడుదలవుతున్న ’ది రాజా సాబ్‘ సినిమాను.. ప్రీమియర్ షోతో ఏపీలో జనవరి 8న సాయంత్రం 6 గంటలకే ప్రదర్శించుకోవచ్చని ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అర్థరాత్రి 12 గంటల లోపు ప్రీమియర్ షోకు పర్మిషన్ ఇచ్చింది.
ఈ లెక్కన చూసుకుంటే.. ఏపీలో జనవరి 8నే ’ది రాజా సాబ్‘ రెండు స్పెషల్ షోలు ప్రదర్శించే అవకాశాలున్నాయి. ఇక.. సినిమా విడుదలయిన రోజు నుంచి.. అంటే జనవరి 9 నుంచి పది రోజుల వరకూ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్పై 150 రూపాయలు, మల్టీప్లెక్స్ల్లో టికెట్పై 200 రూపాయలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ప్రభాస్ హీరోగా మారుతి రూపొందిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ సినిమా నుంచి ‘నాచో.. నాచో’ వీడియో సాంగ్ కూడా విడుదలైంది. ‘రాజా సాబ్’ ట్రైలర్ 2.O పేరుతో మరో ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. రాజాసాబ్‌కు నాయనమ్మ అయిన గంగమ్మ (జరీనా వాహబ్) అన్ని మర్చిపోతుంటుంది. కానీ తన భర్త (సంజయ్ దత్)ను మాత్రం మర్చిపోలేక ఇబ్బంది పడుతుంటుంది.
►ALSO READ | Vijay Jana Nayagan: జనవరి 9న విడుదల కష్టమే.. విజయ్ జననాయగన్ కేసులో తీర్పు రిజర్వ్
మిస్టీరియస్ పర్సన్ అయిన తన తాత గురించి తెలుసుకునేందుకు మయసభ లాంటి తాత హవేలీలోకి అడుగుపెడతాడు. అక్కడున్న వస్తువులు, పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్ లాంటివన్నీ హిప్నటైజ్ చేసేలా డిజైన్ చేసి, అందులోకి అడుగుపెట్టిన వాళ్లు ట్రాన్స్‌లోకి వెళ్లేలా చేస్తాడు తాత.
అంతేకాదు దుష్ట శక్తులను ఆవాహనం చేసుకున్న తాత బంగ్లాలో అడుగడుగునా ప్రమాదాలే. అంత ప్రమాదకరమైన ఆ భవనంలోకి రాజా సాబ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది... భూత ప్రేతాలు, హిప్నాటిజం చిక్కుముడుల నుంచి ఎలా బయటపట్టాడు అనేది అసలు కథ. ఓవైపు భయపడుతున్నట్టుగా, మరోవైపు ధీరుడిగా డిఫరెంట్ మేకోవర్స్‌తో ప్రభాస్ కనిపించాడు.
