
భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయం నుండి వరద ఉదృతి అధికమవుతుందని తెలిపారు అధికారులు. దీంతో ఏ సమయంలోనైనా నాగర్జునసాగర్ గేట్స్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయవచ్చని చెప్పారు. ఖచ్చితమైన సమయం, తేదీని త్వరలోనే తెలియజేస్తామని.. అయితే ముందస్తు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని సిబ్బందికి సూచించారు ఎన్ఎస్పీ అధికారులు.