నిండుకుండలా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్..12గేట్లు ఓపెన్..

నిండుకుండలా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్..12గేట్లు ఓపెన్..

నల్లగొండ: ఎగువ నుంచి వస్తున్న వరద నీరు వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా తలపిస్తోంది. ప్రాజెక్టుకు 1లక్షా 43వేల 567 క్యూసెక్కులు వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండి నిండు కుండలా కనిపిస్తోంది. డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నిల్వ 312.02 టీఎంసీలకు చేరింది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 12 గేట్లు పది అడుగుల మేర ఎత్తి  1లక్షా 43వేల 567 క్యూసెక్కుల నీటిని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. 

ALSO READ | మా డబ్బులు చెల్లించి.. ప్రారంభోత్సం చేసుకోండి : సంగం డైయిరీ ఎదుట రైతుల ఆందోళన