సంగీతమే సగం సక్సెస్‌‌‌‌

సంగీతమే సగం సక్సెస్‌‌‌‌


నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కళ్యాణ్‌‌‌‌ కృష్ణ రూపొందించిన  ‘బంగార్రాజు’ చిత్రం జనవరి 14న విడుదలవుతున్న సందర్భంగా మ్యూజికల్ ఈవెంట్‌‌‌‌ జరిగింది. నాగార్జున మాట్లాడుతూ ‘యాభయ్యేళ్ల  క్రితం సంక్రాంతికి దసరా బుల్లోడు సినిమాతో నాన్నగారు దుమ్ములేపారు. అది మంచి మ్యూజికల్ హిట్. ఏ సినిమాకైనా సగం సక్సెస్ మ్యూజిక్కే. ఈ మూవీకి  అనూప్ రూబెన్స్ కూడా చక్కటి సాంగ్స్ ఇచ్చాడు. ప్రతి సాంగ్ అద్భుతంగా ఉంటుంది’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ‘మనం మూవీ తర్వాత ఈ సినిమాకే ఇలాంటి ఫంక్షన్ చేశాం. పాటలన్నింటినీ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఒక్క పాట హిట్టయితేనే ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. అలాంటిది ఈ సినిమా పాటలన్నింటికీ సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది’ అన్నాడు.  ‘నాగార్జున,  రమ్యకృష్ణ లాంటి సీనియర్లతో నటించడం నా అదృష్టం. సపోర్ట్ చేసిన నాగ చైతన్యకు థ్యాంక్స్’ అని చెప్పింది కృతీశెట్టి. ‘సినిమా సక్సెస్‌‌‌‌ను మ్యూజిక్ డిసైడ్ చేస్తుంది. నాగార్జున గారి ప్రతి సినిమా మ్యూజికల్ హిట్టే. ఇండస్ట్రీలో బంగార్రాజు అంటే ఆయనే. ఇప్పుడు చైతూ వచ్చాడు’ అన్నాడు కళ్యాణ్ కృష్ణ. సుమంత్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, దర్శన, అనూప్ రూబెన్స్, డీవోపీ యువరాజ్, జీ స్టూడియోస్ హెడ్ నిమ్మకాయల ప్రసాద్ కూడా పాల్గొన్నారు.