హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్‌లుగా చేయడానికి సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చిన మున్సిపాలిటీల సవరణ చట్టంపై మరో మూడు పిటిషన్‌లు దాఖలయ్యాయి. జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్‌లుగా విభజిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 55ను, అదేవిధంగా జనవరి 11న తీసుకువచ్చిన మున్సిపాలిటీల సవరణ చట్టాన్ని, అమీన్‌పూర్ మున్సిపాలిటీ విలీనాన్ని సవాల్ చేస్తూ అమీన్‌పూర్‌కు చెందిన 98 ఏండ్ల రైతు హైకోర్టులో వేర్వేరుగా మూడు పిటిషన్‌లు దాఖలు చేశారు.
వీటిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ మంగళవారం విచారణ చేపట్టి ప్రభుత్వంతోపాటు జీహెచ్‌ఎంసీలకు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై ఇప్పటికే దాఖలైన పిటిషన్‌లతో వీటిని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
