తెలంగాణలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు: మొత్తం 1000 పోస్టులు ఖాళీలు.. జస్ట్ డిగ్రీ పాసైతే చాలు..

తెలంగాణలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు: మొత్తం 1000 పోస్టులు  ఖాళీలు.. జస్ట్ డిగ్రీ పాసైతే చాలు..

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ అండ్ సింధ్​ బ్యాంక్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (జేఎంజీఎస్–I) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ మార్చి 21న ప్రారంభమై, ఏప్రిల్ 20న ముగుస్తుంది. 

పోస్టు పేరు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (జేఎంజీఎస్–I).

మొత్తం ఖాళీలు: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 30 పోస్టులు ఉన్నాయి. 

వయోపరిమితి (2026, మార్చి 1 నాటికి): కనీస వయసు 20 సంవత్సరాలు. గరిష్ట వయసు 30 సంవత్సరాలు. అభ్యర్థి1996, మార్చి 2 కంటే ముందు, 2006, మార్చి 1 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన  విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా ఏదైనా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో కనీసం 18 నెలల పని అనుభవం ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మార్చి 31.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850.

లాస్ట్ డేట్: ఏప్రిల్ 20. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

రాత పరీక్ష
రాత పరీక్ష ఆన్​లైన్ పద్ధతిలో ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. 120 ప్రశ్నలు 120 మార్కులకు అడుగుతారు. నెగిటివ్ మార్కింగ్ ఉన్నది.  ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 (1/4వ వంతు) మార్కుల కోత ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగం మినహా పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. అంటే  ప్రతి విభాగానికి నిర్ణీత సమయం ఉంటుంది. ఆ సమయం ముగిసిన తర్వాతే తదుపరి విభాగానికి వెళ్లగలరు. 

లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ 
అభ్యర్థులు ఏ రాష్ట్రం నుంచి దరఖాస్తు చేస్తున్నారో ఆ రాష్ట్ర అధికారిక భాషను (ఉదాహరణకు: తెలంగాణలో అయితే తెలుగు) 10వ తరగతి లేదా 12వ తరగతి మార్క్​షీట్‌లో ఒక సబ్జెక్టుగా చదివి ఉంటే ఈ పరీక్ష ఉండదు. ఒకవేళ పైన పేర్కొన్న తరగతుల్లో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదవకపోతే కచ్చితంగా ఈ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష తర్వాత ఇంటర్వ్యూకి ముందు లేదా ఇంటర్వ్యూ సమయంలో లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో మూడు రకాల నైపుణ్యాలను పరీక్షిస్తారు.

చదవడం: ఒక తెలుగు పేరాగ్రాఫ్ ఇచ్చి చదవమనడం.

రాయడం: చిన్న వ్యాసం లేదా ఉత్తరం రాయమనడం.

మాట్లాడటం: ఇంటర్వ్యూలో భాగంగా స్థానిక భాషలో మాట్లాడమనడం లేదా ఒక అంశంపై వివరించమనడం.
ఫైనల్ మెరిట్: రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. తుది ఎంపికలో రాత పరీక్షకు 70 శాతం, ఇంటర్వ్యూకి 30 శాతం వెయిటేజీ ఉంటుంది.

సిలబస్
బ్యాంకింగ్ నాలెడ్జ్: భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంకింగ్ చట్టాలు, రుణాలు & అడ్వాన్సులు, డిజిటల్ బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాలు
జనరల్ అవేర్‌నెస్ / ఎకానమీ: గత 6 నెలల జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, సంఘటనలు, ఆర్థిక వార్తలు, నియామకాలు, 

ముఖ్యమైన తేదీలు & అవార్డులు.
ఇంగ్లిష్ లాంగ్వేజ్: రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, పారా జంబుల్స్,వొకాబులరీ,

కంప్యూటర్ ఆప్టిట్యూడ్: కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ & నెట్‌వర్కింగ్, బైనరీ నంబర్ సిస్టమ్


మరిన్ని వివరాలకు వెబ్​సైట్  ibpsreg.ibps.inను సందర్శించండి.