సత్తుపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ ఆఫీస్‌లో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ట్యాక్స్ కలెక్షన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటరీ విభాగాలపై ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు.
ముగ్గురు ఎస్సైలతో పాటు 18 మంది అధికారులు మున్సిపల్ ఆఫీస్‌లోని పలు విభాగాల్లో ఫైళ్లను పరిశీలించారు. మరికొందరు ఆఫీసర్లు మున్సిపల్ కమిషనర్‌తో పాటు మేనేజర్ల ఇండ్లలో సైతం తనిఖీలు చేపట్టారు. సంబంధిత ఫైళ్ల తనిఖీతో పాటు డ్యూటీలో ఉన్న ఆఫీసర్లు, సిబ్బంది ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా విచారించారు. తనిఖీలు పూర్తయ్యాక రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందజేస్తామని డీఎస్పీ రమేశ్ చెప్పారు.
