ఉపాధి హామీ స్థానంలో వీబీజీ రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-జీ..

ఉపాధి హామీ స్థానంలో వీబీజీ రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-జీ..
  • రేపు రాష్ట్ర సర్కారు నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చే అవకాశం 
  • అభ్యంతరాలున్నా తప్పని పరిస్థితుల్లో అమలుకు నిర్ణయం
  • కేంద్రం నుంచి వచ్చే 60 శాతం నిధుల కోసం సమ్మతి
  • రాష్ట్ర సర్కారుపై ఏటా రూ.2 వేల కోట్ల అదనపు భారం- 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యారెంటీ ఫర్ రోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గార్ అండ్ ఆజీవికా మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ -గ్రామీణ్’ (వీబీజీ రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-జీ) అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కొత్త విధానం అమలుపై గురువారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త చట్టంలోని పలు నిబంధనలపై రాష్ట్రానికి అభ్యంతరాలు ఉన్నప్పటికీ, కేంద్రం నుంచి వచ్చే 60 శాతం నిధులను కోల్పోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కొత్త విధానం ప్రకారం నిధుల భారం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరించాల్సి ఉంటుంది.

దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.2,000 కోట్ల మేర అదనపు ఆర్థిక భారం పడనుందని అంచనా. దీంతోపాటు 60 రోజుల పని విరామం, గ్రామీణ హక్కుల కుదింపు వంటి నిబంధనలు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు సృష్టిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇదే అంశంపై మంత్రి సీతక్క ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఓకే చెప్పాలని కేంద్రం ఒత్తిడి

జూలై 2న తిరుపతిలో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించనుంది. ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా మిగిలినవన్నీ ఇప్పటికే తమ ఆమోదాన్ని తెలిపాయి. మంగళవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, వెంటనే సమ్మతి తెలపాలని కోరడంతో నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఈ అంశంపై న్యాయపోరాటం చేయాలని లేదా ఇతర రాష్ట్రాలతో కలిసి కేంద్రాన్ని ఎదిరించాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం యోచించింది. అయితే కర్నాటక, కేరళ వంటి రాష్ట్రాలు కూడా దీనికి అంగీకరించడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భేటీలో తుది నిర్ణయం 

జూలై 2న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ కొత్త పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ సమావేశమై రాష్ట్ర అభ్యంతరాల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి? ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయా? అనే అంశాలపై చర్చించనుంది. కేంద్రం నుంచి నిధుల విడుదల ఆగకూడదన్న ప్రధాన ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కొత్త చట్టం అమలుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తున్నది.