కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞం షురూ..వరి విత్తనాలకు రైతుల ప్రత్యేక పూజలు

కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞం షురూ..వరి విత్తనాలకు రైతుల ప్రత్యేక పూజలు

భద్రాచలం, వెలుగు: ‘ఒడ్లు వలుపు రాముని పిలుపు’ పేరుతో నిర్వహిస్తున్న 16వ కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞం మంగళవారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. కోరుకొండ కృష్ణచైతన్య ఆధ్వర్యంలో భక్తులు ప్రతి ఏడాది శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే సీతారాముల కల్యాణం కోసం కోటి గోటి తలంబ్రాలను సమర్పిస్తున్నారు. 

ఈసారి కల్యాణానికి తలంబ్రాల తయారీ కోసం ఉపయోగించే వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు భక్తులు భద్రాచలానికి చేరుకున్నారు. స్వామి సన్నిధిలో విత్తనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, యజ్ఞం విజయవంతం కావాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా యజ్ఞానికి సంబంధించిన ఆహ్వానపత్రికను స్వామివారికి సమర్పించారు. అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వరి విత్తనాలతో గిరిప్రదక్షిణ నిర్వహించారు.