- సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి
హాలియా, వెలుగు: కాంగ్రెస్ సర్కార్ హాయాంలోనే గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా అనుముల మండలంలోని మధారిగూడెం, సాగర్తిరుమలగిరి మండల కేంద్రం, రంగుడ్ల, పెద్దవూర మండలం చలకుర్తి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 14న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలన్నారు. అర్హులైన పేదలందరికి రెండవ విడతలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పక్కా ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోరుతూ ఓటర్లను కలుసుకుని అభ్యర్థించారు.
హాజారిగూడెంలో కార్యకర్తలతో జానారెడ్డి భేటీ..
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అనుముల మండలంలోని హాజారిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. తన హాయాంలోనే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేశానని జానారెడ్డి చెప్పారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి, నాయకులు కాకునూరి నారాయణగౌడ్, చింతల చంద్రారెడ్డి, వెంపటి శ్రీనివాస్, గౌని రాజారమేష్ యాదవ్, రావుల శీను, రిక్కల కొండారెడ్డి, రిక్కల వసంత సుధాకర్‌రెడ్డి, రిక్కల పెద వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

