పీఎం శ్రీ పాఠశా లల్లో పను లను త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్  

పీఎం శ్రీ పాఠశా లల్లో పను లను త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్  
  •   నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్  

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : పీఎం శ్రీ పథకం కింద జిల్లాలో ఎంపికైన 14 పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని  నాగర్​ కర్నూల్​ కలెక్టర్ బదావత్ సంతోష్  ఇంజినీరింగ్, విద్యాశాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లోని తన చాంబర్​లో ఆయన  సమీక్షించారు.

పీఎం శ్రీ పథకం కింద జిల్లాలోని పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, ప్రయోగశాలలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపట్టిన పనులను రానున్న రెండు నెలల్లో పూర్తిచేసి, సంబంధిత బిల్లులను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా సమయపాలనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈఓ రమేశ్​కుమార్, ఈడబ్ల్యూఐడీసీ ఎస్ సీ రామచంద్ర రావు, సెక్టోరియల్ అధికారి వెంకటయ్య పాల్గొన్నారు.