నాగర్ కర్నూల్: 8 మంది అంగన్‌‌వాడీ సిబ్బంది తొలగింపు

నాగర్ కర్నూల్: 8 మంది అంగన్‌‌వాడీ  సిబ్బంది తొలగింపు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : విధులకు హాజరుకాని మూడు ప్రాజెక్టుల్లో 8 మంది అంగన్‌‌వాడీ సిబ్బందిని సేవల నుంచి తొలగిస్తున్నట్టు  కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. అంగన్‌‌వాడీ కేంద్రాలు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంతో పాటు ఆరోగ్య సేవలు అందించే విషయంలో లబ్ధిదారులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

అచ్చంపేట, బల్మూర్, కొల్లాపూర్ ప్రాజెక్టుల పరిధిలో పనిచేస్తున్న పలువురు అంగన్‌‌వాడీ సిబ్బంది 2023 ఫిబ్రవరి నుంచి 2026 జనవరి వరకు  పలు సందర్భాల్లో గైర్హాజరయ్యారని  తెలిపారు. జిల్లాలో జి. వెంకటమ్మ, ఎస్. అరుణ, జి. సుల్తానమ్మ, జె. మహాలక్ష్మి, సి. పద్మావతి, నిరంజన్‌‌బెల్ల, కాశమ్మ, దర్జి బక్కమ్మ ఉన్నారు. జిల్లాలోని అన్ని అంగన్‌‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.