కొత్త యాపట్ల పరిసరాల్లో పులి సంచారం.. చిగురుతిప్పలో మేకను ఎత్తుకెళ్లిన టైగర్

కొత్త యాపట్ల పరిసరాల్లో పులి సంచారం.. చిగురుతిప్పలో మేకను ఎత్తుకెళ్లిన టైగర్

పెద్దకొత్తపల్లి, వెలుగు: నాగర్ కర్నూల్  జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం కొత్తయాపట్ల సమీపంలో పులి సంచారం కలకలం రేపింది. చిగురుతిప్ప ప్రాంతంలో గొల్ల శివుడు మేతకు తీసుకెళ్లిన మేకల గుంపులో నుంచి ఓ మేకను పులి ఎత్తుకెళ్లింది. పెంపుడు కుక్కలు పసిగట్టి వెంబడించడంతో పులి మేకను వదిలి పరారైంది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్​ ఆఫీసర్లు అటవీ ప్రాంతానికి వెళ్లే గొర్రెలు, మేకల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.