
రామడుగు, వెలుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామ పరిధిలోని గుడ్డెలుగులపల్లి కి చెందిన నాగసముద్రం శ్రీనివాస్(40) అనే వ్యక్తి దుబాయిలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నాగ సముద్రం శ్రీనివాస్ కొన్ని సంవత్సరాల నుంచి దుబాయికి వెళుతూ అక్కడి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడ రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని సకాలంలో గ్రామానికి తరలించి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.