బంగ్లాదేశ్ కెప్టెన్ సంచలన బ్యాటింగ్..కోహ్లీని దాటేసి స్మిత్‌ను సమం చేశాడు

బంగ్లాదేశ్ కెప్టెన్ సంచలన బ్యాటింగ్..కోహ్లీని దాటేసి స్మిత్‌ను సమం చేశాడు

బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్ నజీముల్లా శాంటో టెస్టు క్రికెట్ లో తన టాప్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఏకంగా ఫ్యాబ్ ఫోర్ గా కొనసాగుతున్న స్మిత్, కోహ్లిలకు షాకిచ్చాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా  సెంచరీ బాదేశాడు. 192 బంతుల్లో 9 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న శాంటో.. 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో తన కెరీర్ లో 5 వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ గా పగ్గాలు అందుకున్న తొలి టెస్టులోనే ఈ స్టార్ బ్యాటర్ సెంచరీ అందుకోవడం విశేషం. 

శాంటోకి ఇది చివరి నాలుగు ఇన్నింగ్స్ ల్లో మూడో సెంచరీ కావడం విశేషం. అంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్ పై వరుసగా రెండు సెంచరీలు చేసిన శాంటో..న్యూజిలాండ్ పై తొలి ఇన్నింగ్స్ లో 37 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో 2023 టెస్టుల్లో కోహ్లీ కన్నా ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ ఈ ఏడాది టెస్టుల్లో 2 సెంచరీలు చేసాడు. మూడు సెంచరీలు చేసిన  శాంటో స్మిత్(3) సెంచరీల రికార్డ్ సమం చేశాడు. 

ఈ లిస్టులో న్యూజీలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియంసన్ 4 సెంచరీలతో అగ్ర స్థానంలో ఉండగా.. శాంటో, స్టీవ్ స్మిత్ వరుసగా రెండో స్థానంలో నిలిచారు. శాంటో ఆటతో బంగ్లాదేశ్ తొలి టెస్టులో పట్టు బిగిస్తుంది. మూడో రోజు ఆట ముగిసేసరికి 3 వికెట్లను 212 పరుగులు చేసింది. ప్రస్తుతం బంగ్లా జట్టు 205 పరుగుల ఆధిక్యంలో ఉంది. శాంటో 104, ముషఫికర్ రహీం 43 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతక ముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 310 పరుగులు చేస్తే న్యూజీలాండ్ 317 పరుగులకు ఆలౌటైంది.