నల్గొండ అర్బన్, వెలుగు : డ్రగ్స్ నివారణకు జిల్లాలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మత్తు పదార్థాల నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలను వినియోగించి జీవితం పాడు చేసుకోకుండా అన్ని శాఖల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా పాఠశాలలు, హాస్టల్ల వద్ద మత్తుపదార్థాలు అమ్మకుండా చూడాలని, తల్లిదండ్రులు, టీచర్ల సమావేశంలో అవగాహన కల్పించాలని, పాఠశాలలు, హాస్టళ్ల బయట షాపులలో మత్తుపదార్థాలు అమ్మకుండా చూడాలన్నారు.
