నల్గొండ, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ మండలంలోని చెన్నుగూడెం- దమ్మన్నగూడెం, నర్సింగ్ బట్ల, దండంపల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా గెలిస్తే ఆ గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామాల్లో రోడ్లు, సీసీ రోడ్లు, మురుగు కాలువలు తదితర అన్ని సమస్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.
గతంలో ఉన్న ప్రభుత్వం గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన అభివృద్ధి పనులే తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే గ్రామ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
