- నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో గేదెను ఢీకొట్టిన రైలు
నల్గొండ, వెలుగు : పల్నాడు – -సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. రైలు నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మగూడెం వద్దకు రాగానే... ఓ గేదెను ఢీకొట్టింది. రైలు చక్రాల కింద గేదె ఇరుక్కుపోవడంతో అప్రమత్తమైన లోకో పైలట్‌ను వెంటనే రైలును నిలిపివేశారు.
గేదె ఢీకొట్టడం వల్ల రైలు ఇంజిన్‌లో సమస్యలు తలెత్తడంతో లోకోపైలెట్ రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని ఇంజిన్‌కు రిపేర్లు చేసి రైలును పంపించారు. రిపేర్లు పూర్తయ్యే వరకు రైలు అక్కడే నిలిచిపోవడంతో నల్గొండ – మిర్యాలగూడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
