
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం గోపాలపల్లిలోని వేణు గోపాలస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఎప్పుడూ పెద్దగా జనాలు రాని ఈ ఆలయానికి ఇవాళ సడెన్ గా వందలమంది భక్తులు తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన వారితో టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ జాం అయ్యిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. అమావాస్య రోజు గోపాలపల్లి వేణుగోపాల స్వామిని దర్శించుకుంటే.. కోరిన కోర్కెలు తీరుతాయంటూ సన్నిధానం లక్ష్మీకాంత శర్మ చేసిన ప్రచారంతోనే భక్తులు ఈ స్థాయిలో వచ్చినట్టు తెలుస్తోంది.
ఐతే ఈ వార్తలను నల్గొండ ఎస్పీ రంగనాథ్ కొట్టి పారేశారు. ఆలయం సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను వృద్ధి చేసుకునేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆలయ ట్రస్ట్ సభ్యులు కుమ్మక్కై ఇలాంటి తప్పడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రజలు ఇలాంటి నమ్మవద్దని సూచించారు.
\