పెట్టీ కేసుల్లో నిందితులు.. ఒక రోజు సామాజిక సేవకులు.. కోర్టు ఆదేశాలతో కృష్ణకాంత్ పార్కులో పనులు

పెట్టీ కేసుల్లో నిందితులు.. ఒక రోజు సామాజిక సేవకులు.. కోర్టు ఆదేశాలతో కృష్ణకాంత్ పార్కులో పనులు

జూబ్లీహిల్స్, వెలుగు: వివిధ పెట్టీ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి నాంపల్లి కోర్టు సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25 మంది, బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 మంది, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 5 మంది నిందితులు.. మొత్తం 42 మంది నిందితులతో కోర్టు ఆదేశాల మేరకు బుధవారం పోలీసులు వెంగళరావునగర్ లోని కృష్ణ కాంత్ పార్కులో పారిశుధ్య పనులు చేయించారు. వారంతా పార్కులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని క్లీన్ చేశారు.