
NRCపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నాంపల్లి కోర్టు ముందు పౌరసత్వ సవరణ చట్టానికి కొందరు న్యాయవాదులు మద్దతు తెలపగా… మరికొంతమంది దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పౌరసత్వ సవరణ బిల్లు కొన్ని వర్గాల వారికే అనుకూలంగా ఉందని ఆరోపించారు కొందరు న్యాయవాదులు. దేశంలోకి అరాచక శక్తులు ప్రవేశించకుండా అడ్డుకునేందుకే కేంద్రం NRCని తీసుకొచ్చిందన్నారు మరికొందరు అడ్వకేట్లు. దీంతో కోర్టు ముందు కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.