బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు నానా పటేకర్ తుదిశ్వాస విడిచారు. గురువారం ( అక్టోబర్ 8 ) గోవాలోని డోనా పౌలాలో ఆయన నివాసంలో మృతి చెందారు నానా పటేకర్. నానా పటేకర్ గుండెపోటుతో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది అయనను సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో 45 నిమిషాల పాటు CPR చేసి ఆయనను బతికించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం ఇవ్వలేదు. ఇవాళ ఉదయం 5:20 నిమిషాలకు ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు డాక్టర్లు.
స్టార్ స్టేటస్, లగ్జరీ లైఫ్.. పల్లెటూరిలో సొంత ఇంట్లో...
1978లో గమన్ సినిమాతో బాలీవుడ్ లో ఎంటరు ఇచ్చిన నానాపటేకర్ తన విలక్షణ నటనతో లెజెండరీ యాక్టర్ గా ఎదిగారు. దాదాపు 4 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న నానా పటేకర్ కు ఫామ్ హౌస్ లు, లగ్జరీ కార్లు, ఇతర ఆస్తులు చాలా ఉన్నప్పటికీ సింపుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేశారు నానాపటేకర్. పూణే సమీపంలోని ఖడక్వాస్లాలో 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు నానా.
సిటీకి దూరంగా తన 25 ఎకరాల పొలంలో ఇల్లు కట్టుకొని సాదారణ జీవితం గడిపారు నానా. తన పొలంలోనే ధాన్యాలు, గోధుమలు, ఆకుకూరలు, కూడా నానా. తన ఇష్టానికి అనుగుణంగా ఆయన ఫామ్ హౌస్ లో చెక్క ఫర్నిచర్, టెర్రకోట ఫ్లోర్ వేయించుకున్నారు నానా. ఫామ్ హౌస్ చుట్టూ అనేక రకాల చెట్లు, పొదలు పెంచుకున్నారు. పెద్దసంఖ్యలో ఆవులు, గేదెలుఉన్నాయి.
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్
నానాపటేకర్ 1951 జనవరి 1న మహారాష్ట్రలోని మురుడ్ లో జన్మించారు నానాపటేకర్. ముంబైలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో విద్యను అభ్యసించిన ఆయన నటనపై ఆసక్తితో రంగస్థల ప్రయాణాన్ని ప్రారంభించారు. 1978లో గమన్ సినిమాతో తన బాలీవుడ్ జర్నీ స్టార్ట్ చేసిన ఆయన అదే ఏడాది నీలకాంతిని వివాహం చేసుకున్నారు. వారికి దుర్వాస, మల్హర్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. దుర్వాస రెండున్నరేళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు. నానా తన 28 ఏళ్ళ వయసులో తండ్రిని కోల్పోయారు. నానా పాటేకర్ కు ఇద్దరు సోదరులు. తన తల్లి నిర్మల పటేకర్ 99 ఏళ్ళ వయసులో మరణించేవరకు ఆమెను అల్లారుముద్దుగా చిన్నపాపలా చూసుకున్నారు నానా పాటేకర్.
