అన్విత గ్రూప్ కు..బాలకృష్ణ ప్రచారం

అన్విత గ్రూప్ కు..బాలకృష్ణ ప్రచారం

హైదరాబాద్​, వెలుగు: రియల్ ఎస్టేట్ ​కంపెనీ అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌‌గా నటుడు నందమూరి బాలకృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సంస్థ రూపొందించిన బ్రాండ్ ఫిల్మ్స్‌‌ను  సీఎండీ అచ్యుతరావు హైదరాబాద్‌‌లో శుక్రవారం విడుదల చేశారు. గత రెండు దశాబ్దాలుగా దుబాయ్,  అమెరికా దేశాలలో నిర్మాణ రంగంలో ఉన్న ఈ సంస్థ ప్రస్తుతం హైదరాబాద్‌‌లో 80 లక్షల చదరపు అడుగుల మేర ప్రాజెక్టులు చేపడుతోంది.

విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో అత్యంత ఎత్తైన భవనాలను నిర్మించనున్నట్లు సంస్థ ప్రకటించింది. హైదరాబాద్​ కొల్లూరులోని అన్విత ఇవానా ప్రాజెక్ట్ తొలి దశలో 400 యూనిట్లను సిద్ధం చేసింది. ఏటా 1,000 ఇళ్లను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. బాలకృష్ణ వ్యక్తిత్వం తమ సంస్థ విలువలకు సరిపోతుందని అచ్యుతరావు పేర్కొన్నారు.