చలపతిరావుకు నివాళులర్పించిన బాలయ్య

చలపతిరావుకు నివాళులర్పించిన బాలయ్య

టాలీవుడ్ నటులు చలపతిరావు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇవాళ చలపతిరావు 11వరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఆయన చలపతిరావు చిత్రపటంపై పూలు చల్లి నివాళులర్పించారు. చలపతిరావు కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. కాగా, చలపతిరావు ఈ నెల 25 న గుండెపోటుతో చలపతిరావు మరణించారు.  జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. 

చలపతిరావుకు ఒక కుమారుడు రవిబాబు, ఇద్దరు కుమార్తెలు మాలినిదేవి, శ్రీదేవి ఉన్నారు.  600కు పైగా సినిమాల్లో నటించిన చలపతిరావు... నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. 1966లో ‘గూడచారి 116’ సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, రాష్ట్రపతి గారి అల్లుడు సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు. ఇక తన చివరి సినిమా కొడుకు డైరెక్షన్‌‌లోనే నటించారు.