
సంక్రాంతికి విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న హనుమాన్(HanuMan) సినిమాపై ప్రశంసలు కురిపించారు బాలకృష్ణ(Balakrishna). ఇటీవల ఈ చిత్రాన్ని చూసిన బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఇందులో మంచి కంటెంట్ ఉంది. ఇప్పుడున్న టెక్నిక్‌ను వాడుకుని, అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా దర్శకుడు అద్భుతంగా తీశారు.
కన్నుల పండుగలా ఉంది. మేకింగ్‌లో ప్యాషన్ కనిపించింది. నటీనటులతో పాటు డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్, మ్యూజిక్ ఇలా అన్ని క్రాఫ్ట్స్ అద్భుతమైన పనితీరు కనపరిచాయి. టీమ్ అందరికీ అభినందనలు. సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పారు. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కె. నిరంజన్ రెడ్డి నిర్మించారు.