ఎన్టీఆర్ కుటుంబం నుంచి నాలుగో తరం హీరో

ఎన్టీఆర్ కుటుంబం నుంచి  నాలుగో తరం హీరో

ఎన్టీఆర్ కుటుంబం నుంచి నాలుగోతరం వారసుడు హరికృష్ణ మనవడు,  జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ  వైవీఎస్ చౌదరి దర్శక నిర్మాతగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కూచిపూడి డ్యాన్సర్, తెలుగు అమ్మాయి వీణారావును హీరోయిన్‌‌గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.  సోమవారం హైదరాబాద్‌‌లోని  ఎన్టీఆర్ ఘాట్‌‌లో ఈ మూవీ ప్రారంభోత్సవం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో హీరోయిన్లపై నారా భువనేశ్వరి క్లాప్ కొట్టారు. 

దగ్గుబాటి పురందేశ్వరి కెమెరా స్విచాన్ చేశారు. లోకేశ్వరి గౌరవ దర్శకత్వం వహించగా, నందమూరి సుహాసిని, నందమూరి మోహన్ రూప,  నందమూరి వసుంధర,  దగ్గుబాటి నివేదిత, నందమూరి దీపిక, నందమూరి జయశ్రీ, నందమూరి లక్ష్మీ హరి కృష్ణ, కంటమెన్ని దీక్షిత స్క్రిప్ట్‌‌ని అందించారు. 

నందమూరి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమానికి హాజరై తారక్‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. డైరెక్టర్ వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ ‘తెలుగు సాహిత్యం తెలుగు సంప్రదాయం హైందవ సంస్కృతి నేపథ్యంలో నా శాయశక్తులా కష్టపడి ఒక మంచి కథని తయారు చేశాను. ఆ కథ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.