Devil Twitter Review : డెవిల్ ట్విట్టర్ రివ్యూ ... కల్యాణ్ రామ్‌కు మరో హిట్

Devil Twitter Review : డెవిల్ ట్విట్టర్ రివ్యూ ...  కల్యాణ్ రామ్‌కు మరో హిట్

బింబిసార లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తరువాత  నందమూరి కల్యాణ్ రామ్ నుంచి  వచ్చిన  చిత్రం డెవిల్. సంయుక్తా మీనన్‌, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటించగా,  అభిషేక్‌ పిక్చర్స్‌ఫై అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రిలీజైన ట్రైలర్, పాటలు  సినిమాపైన మంచి హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం 2023 డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

Good 1st Half ?

Good story point

A Bit slow to takeoff but Gripped well and maintained intriguingly well

Perfect blend of Commercial elements and investigative narration

Bgm?

Interval bang is good

Vfx could have been much better #Devil

— PKC (@PKC997) December 28, 2023

ఈ క్రమంలో  సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ట్విట్టర్ లో ఈ సినిమాకు  ప్రేక్షకులు నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది.  కల్యాణ్‌ రామ్‌ వన్‌మ్యాన్‌ షో అంటున్నారు. ఫస్ట్ హాఫ్ డిసెంట్ అని, ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయిందని, ఇక సెంకడాఫ్ లో వచ్చే ట్విస్టులు బాగన్నాయని ,  బ్లాక్ బస్టర్ హిట్ బొమ్మ అని కన్ఫామ్ అంటూ  కామెంట్లు పెడుతున్నారు.  ఇదే టాక్ కంటిన్యూ అయితే మాత్రం కల్యాణ్ రామ్ ఖాతాలో మరో హిట్  పడినట్లే.  

1st hlf purely story based.
2nd hlf few chill moments ?
2nd hlf > 1st hlf @NANDAMURIKALYAN one Man Show ???
Good thriller commercial #Devil#Devilreview https://t.co/KOo1Mh1xT0 pic.twitter.com/SkhU5yC7C5

— పల్నాడు ? (@_palnaduTiger_) December 28, 2023

ఎక్కువగా ప్రయోగాలు చేయడానికి కల్యాణ్ రామ్ ఇష్టపడుతుంటారు. అలాంటి ప్రయోగమే ఈ డెవిల్.  బ్రిటీష్ కాలం నాటి కథతో రూపొందింది ఈ చిత్రం..   ఓ హత్య జరగడం.. దానిని చేధించేందుకు సీక్రెట్ ఏజెంట్ గా హీరో ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత అతడు ఎన్నో ఊహించని విషయాలను బయటపెట్టడం అనే అంశాలతోనే ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించాడు.