
నందమూరి కళ్యాణ్ రామ్(NandamuriKalyanRam) కొత్త మూవీ ‘డెవిల్’ గ్లింప్స్(DevilGlimpse) ను రిలీజ్ చేశారు. ఇవాళ (జూలై 7న) పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది.
సముద్రంలో షిప్ కదలడం, నావికా పోలీసులు రేడియోలో అలర్ట్ వినడం..స్వతంత్రం పోరాటానికి ముందు జరిగిన కథను చూపిస్తూ.. ఒక మహిళను గొలుసులతో కోటలో కట్టేసి కొట్టడం, ఒక వ్యక్తిని నిటారుగా వేలాడ దీయడం వంటివి టీజర్ లో చాలా ఆసక్తికరంగా మలిచారు మేకర్స్. వీరిని కాపాడుట కోసం డెవిల్ గా కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సామ్రాజ్యంలోకి ఏజెంట్ గా ఎంట్రీ అవ్వడం చూపించిన తీరు ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి.
దీంతో మూవీపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ టీజర్ లో 'మీరు చెప్పేదానికి చేసే దానికి ఆలోచించేదానికి అస్సుల సంబంధం ఉండదు' అని సత్య(Satya) అడగ్గా ‘‘మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు, మొదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు. అదే గూఢచారికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం’’ అని కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి.
ఈ మూవీలో విజువల్స్ చాలా గ్రాండ్ గా పర్ఫెక్ట్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తున్నాయనే తెలుస్తోంది. హర్షవర్ధన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ మూవీలో సంయుక్త మీనన్(SamyukthaMenon), - మాళవిక నాయర్(Malvika Nair) హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇకపోతే రీసెంట్ గా 500 మంది ఫైటర్స్ తో ఓ యాక్షన్ ఎపిసోడ్ కూడా చిత్రీకరించారు. ఈమూవీకు ఇది హైలైట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. 'డెవిల్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న..ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. డెవిల్ 'ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్' అనేది ట్యాగ్ లైన్.