
సినీ నటుడు నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తారకత్నకు ఎంఆర్ఐ స్కానింగ్ చేశామని ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అందులో చెప్పారు. మెదడుకు సంబంధించిన ట్రీట్ మెంట్ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. విదేశీ వైద్యులను రప్పించి ట్రీట్మెంట్ చేయిస్తున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. మరోవైపు బాలకృష్ణ కూడా సినిమా షూటింగులకు బ్రేక్ ఇచ్చి తారకరత్న ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.