
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు తారకరత్నను చూసేందుకు ప్రత్యేక విమానంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ వెళ్తున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్ర సమయంలో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ముందుగా కుప్పంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. మయోకార్డియల్ ఇన్‌ఫార్క్‌షన్ కారణంగా తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారని.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సాయంత్రం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు వెళ్లారు. తారకరత్న తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్యతో మాట్లాడారు. మరోవైపు ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబుతో పాటు బాలకృష్ణ కూడా డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు.