అధికారం శాశ్వతం కాదు.. ఏదో ఒకరోజు దిగిపోవాల్సిందే

అధికారం శాశ్వతం కాదు.. ఏదో ఒకరోజు దిగిపోవాల్సిందే
  • తెలంగాణను ఏ ఒక్కరికీ రాసియ్యలే
  • అధికారం శాశ్వతం కాదు
  • సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి 

హనుమకొండ, వెలుగు: పోరాడి సాధించుకున్న తెలంగాణను ఏ ఒక్కరికీ శాశ్వతంగా రాసివ్వలేదని, అధికారం శాశ్వతం కాదని, ఏదో ఒకరోజు దిగిపోవాల్సిందేనని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో గురువారం కేంద్ర సాహిత్య అకాడమీ, తెలుగు విభాగం ఆధ్వర్యంలో కాళోజీ జీవితం – సాహిత్యం అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు కేయూ లెక్చరర్లు ‘ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే.. పొలిమేర వరకు తరిమికొడతాం. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం’ అన్న కాళోజీ కవితను చెబుతూ ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులను గుర్తు చేశారు. అలాగే వరంగల్ కు చెందిన విప్లవ కవి వరవరరావు జైలులో ఉంటే కవులు, రచయితల గళాలు ఎందుకు మూగబోయాయని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. పరిస్థితులు పండినప్పుడు ప్రజల్లో ఎప్పుడైనా చైతన్యం వస్తుందన్నారు. గద్దె మీద కూర్చున్న వాళ్లంతా తాము జీవితాంతం గద్దె మీదనే ఉంటామని అనుకుంటారని, కానీ పరిస్థితులు పండిననాడు తప్పకుండా గద్దె దిగాల్సిందేనని, ఇంకొకరు ఎక్కాల్సిందేనన్నారు.